ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

by సూర్య | Thu, Jan 13, 2022, 04:36 PM

ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉదయం నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా రానున్న మూడు గంటల్లో కృష్ణా, గోదావరి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్రలో సైతం వర్షాలు కురుస్తాయని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరో వైపు వర్షాలతో అన్నదాతకు అకాల కష్టం వాటిల్లింది. పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, పత్తి, వరి, పండు మిర్చి పంటలకు అపార నష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
ఇదెక్కడి రాజకీయం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని Thu, Jul 07, 2022, 03:54 PM
భీమవరం సభపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు Thu, Jul 07, 2022, 03:51 PM
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ Thu, Jul 07, 2022, 03:23 PM
పార్టీ కమిటీలకు సంబంధించి నూతన విధానం Thu, Jul 07, 2022, 03:20 PM
వైసీపీ ప్లీనరీ సీడీల‌ విడుదల Thu, Jul 07, 2022, 03:18 PM