ముఖ్య మంత్రితో బేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మెగాస్టార్ చిరంజీవి బేటీ అయ్యారు. సినిమా టికెట్ల విషయమై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది. తొలుత ముఖ్యమంత్రికి పుష్పకుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రితో బేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారని అన్నారు. సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చానని, సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చిందని, అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని సీఎం కి చెప్పానని అన్నారు.


కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారని, సినీ పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నాను అని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారని, సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కొత్త జీవో ఇస్తామని సీఎం చెప్పారని, ఐదో షోలు ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని సీఎం తెలిపారని సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఎవరూ లేని పోని కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చిరంజీవి అన్నారు. పెద్ద బడ్జెట్ సినిమా నా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని, రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తామని చెప్పారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM