కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ప్రియాంకా గాంధీ

by సూర్య | Thu, Jan 13, 2022, 03:57 PM

ఉత్తర్ ప్రదేశ్  ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. 125 స్థానాలకు అభ్యర్థులను ప్రియాంకా గాంధీ ప్రకటించారు. ఇందులో 50 మంది మహిళలున్నారు.  తొలి విడతలో 40 శాతం సీట్లు మహిళలకు, మరో 40 శాతం యువతకు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి ఉన్నావో అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆశా వర్కర్ల కోసం గళమెత్తిన పూనమ్ పాండేను షాజహాన్ పూర్ బరిలో


నిలిపారు. ఇది ఉత్తరప్రదేశ్ లో కొత్త తరహా రాజకీయాలకు నాంది అని ప్రియాంక స్పష్టం చేశారు.న్యాయం కోసం పోరాడుతున్నవారికి అధికారం ఇవ్వడానికి అవకాశమిస్తున్నామని పేర్కొన్నారు. తాము వ్యతిరేక రాజకీయాలు నడపబోమని, సానుకూల రాజకీయాలే చేస్తామని ప్రియాంక తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలు, అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు.


 


 

Latest News

 
ఘాట్ రోడ్డు లోయలో పడిన లారీ Sat, May 21, 2022, 02:27 PM
మలేరియా నివారణకు మందు పిచికారీ Sat, May 21, 2022, 02:25 PM
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ Sat, May 21, 2022, 02:22 PM
విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన ప్రజలు Sat, May 21, 2022, 02:16 PM
జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి Sat, May 21, 2022, 02:14 PM