విద్యుత్ షాక్ తో తాపీ కార్మికుడు మృతి
 

by Suryaa Desk |

విద్యుత్ షాక్ తో తాపీ కార్మికుడు మృతి చెందిన సంఘటన పట్టణంలోని 18వ వార్డులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వి. సూర్యనా రాయణ కథనం మేరకు 17వవార్డుకు చెందిన గూడూరు నరేంద్ర(29) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విధుల్లో భాగంగా వార్డు లోని జగనన్న కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పనులకు వెళ్లాడు. ఇంటిపైన పనులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తగిలి నరేంద్ర అక్క. డిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. నరేంద్ర, నాగమణిలకు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. మూడు సంవత్సరాల కుమారుడు, రెండు సంవత్సరాల కుమార్తెలు ఉన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులతో నాగమణి తన భర్త నరేంద్ర మృత దేహం వద్ద విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, తహసీల్దార్ విజయశ్రీ, ఎస్ఐ అబ్దుల్ రజాక్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM