74 ఏళ్ల తర్వాత కలుసుకున్న అన్నదమ్ములు

by సూర్య | Thu, Jan 13, 2022, 12:03 PM

ఆ ఇద్దరు అన్నదమ్ములు భారత్‌, పాక్ విడిపోయినప్పుడు విడిపోయారు. ఒకరు పాకిస్తాన్‌లో, మరొకరు భారత్‌లోని పంజాబ్‌ లో నివసిస్తున్నారు. 74 ఏళ్ల తర్వాత కర్తార్‌పూర్‌లో మంగళవారం కలుసుకున్నారు. ఒకరినొకరు గాఢంగా ఆలింగనం చేసుకొని, భావోద్వేగానికి లోనయ్యారు.


వివరాల్లోకి వెళితే.. మహ్మద్ సిఖ్ఖిఖీ, హబీబ్ ఇద్దరూ అన్నదమ్ములు. సిఖ్ఖిఖీ పాక్‌లోని ఫైసల్‌బాద్‌లో ఉంటాడు. హబీబ్ భారత్‌లోని పంజాబ్‌లో నివసిస్తున్నాడు. దేశ విభజన సందర్భంగా వీళ్లు విడిపోయారు. ఇటీవల కర్తార్‌పూర్ కారిడార్ గురుద్వారా సాహిబ్ దర్శనానికి హబీబ్ వచ్చాడు. ఇక్కడే ఆ అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు. గాఢంగా ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ.. కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించడాన్ని అభినందించారు. విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకోవడానికి ఎంతో ఉపకరిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM