కజికిస్తాన్ లో శాంతియుత వాతారణం

by సూర్య | Wed, Jan 12, 2022, 11:25 PM

గత కొంత కాలంగా అల్లకల్లోలంగా మారిన కజికిస్తాన్ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. కజకిస్తాన్‌లో పరిస్థితులు మారుతున్నాయి. దేశంలో నెలకొన్న అశాంతి మెల్లగా చల్లబడుతోంది. గత కొంతకాలంగా అక్కడ హింస చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక దళాలు, మిలిటరీ మధ్య కాల్పులు జరుగడంతో చాలా మంది చనిపోయారు. కజకిస్తాన్ పరిస్థితిని రష్యా దగ్గరుండి పరిశీలిస్తోంది. శాంతిదిశగా ప్రయత్నాలు జరగడంతో.. అధ్యక్షుడు కసీమ్ జోమార్ట్ టోకయేవ్ కొత్త ప్రధానమంత్రిని నియమిస్తామని ప్రకటించారు. దీంతో అక్కడినుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్లేందుకు సంసిద్దం అవుతున్నాయి. రెండురోజుల్లో ఇక్కడినుంచి వెళ్లిపోతామని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటి ఆర్గనైజేషన్ తెలిపింది. కజకిస్తాన్‌లో చమురు నిల్వలు అధికం.. ఆ ఇష్యూపైనే తిరుగుబాటుదారులకు, సైన్యానికి మధ్య ఘర్షణ జరుగుతుంది. కజకిస్తాన్ భద్రతా దళాలు 10 వేల మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ తెలియజేసింది. టోకయేవ్ కొత్త ప్రధానమంత్రి అన్వేషణలో ఉన్నారు. అలిఖాన్ స్మాలొవ్‌ను కొత్త ప్రధానిగా నియమిస్తారు. దిగువ సభ అందుకు ఆమోదం తెలిపింది. స్మాలొవ్ గత ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు. కజకిస్తాన్‌లో గత ఆదివారం 164 మంది ఆందోళనకారులు చనిపోయారు. కానీ దానిని సాంకేతి కారణం అని చెప్పి.. కప్పిపుచ్చుకున్నారు. సాయుధులైన 26 మంది చనిపోయారు. 16 మంది భద్రతా సిబ్బంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి కుదుపడిందని అధ్యక్షుడు తెలిపారు. జానావోజెన్ పట్టణంలో జనవరి 2వ తేదీన ప్రదర్శనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చమురు ఉత్పత్తికి పేరు గాంచిన ఇక్కడ పదేళ్ల కింద కూడా ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య భయంకరమైన ఘర్షణలు జరిగాయి. నిరసన ప్రదర్శనలు జానావోజెన్ నుంచి క్రమంగా దేశమంతా వ్యాపించాయి. అల్మాటీలో శాంతిభద్రతలను కాపాడే క్రమంలో అల్లరిమూకలను కాల్చి చంపామని భద్రతా బలగాలు చెబుతున్నాయి. ప్రదర్శనకారులు నగరంలోని పోలీసు స్టేషన్లను కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి సద్దుమణగడం.. కొత్త ప్రధాని నియామకం నేపథ్యంలో రష్యా దళాలు కూడా వెనక్కి వెళ్లిపోనున్నాయి.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM