యూకేలో అతి తక్కువ బరువున్న శిశువు జననం

by సూర్య | Wed, Jan 12, 2022, 11:23 PM

ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకొంటుంటాయి. అలాంటి ఘటనే యూకేలో చోటు చేసుకొంది. యూకేలో అరుదైన ఘటన జరిగింది. 17 సంవత్సరాల వయసున్న యువతి నెలలు నిండని ఒక పసిబిడ్డకు జన్మనిచ్చింది. 325 గ్రాములు అతి తక్కువ బరువు ఉన్న ఈ పసికందు గత 20 సంవత్సరాలలో యూకేలో జన్మించిన అతి తక్కువ బరువున్న శిశువుగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యంగా ఉంది. ఎల్లీ పాటన్, 17 సంవత్సరాల వయసున్న బాలిక అత్యవసర సి-సెక్షన్ తర్వాత కేవలం 25 వారాల శిశువు హన్నాకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు నవజాత శిశువు బరువు కేవలం 325 గ్రాములు ఉందని వైద్యులు తెలిపారు. ఈ శిశువు బతికే అవకాశం 20 శాతం మాత్రమే అని వైద్యులు వెల్లడించారు. తన బిడ్డ రాత్రి వరకు కూడా బ్రతుకక పోవచ్చని తల్లికి చెప్పారు వైద్యులు. కానీ పాప హన్నా మాత్రం ప్రాణాల కోసం పోరాడేంత దృఢంగా ఉంది. ప్రస్తుతం పాప వెంటిలేటర్ మీద ఉంది. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉంది.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM