ఢిల్లీలో దారికి కరోనా వైరస్

by సూర్య | Wed, Jan 12, 2022, 08:48 PM

ఢిల్లీ రాష్ట్రంలో క్రమంగా కరోనా వైరస్ దారిలోకి వస్తుంది. కరోనా వైరస్ కేసులు పెరగకుండా రాష్ట్రంలో కొత్త కేసులు స్థిరంగా ఉన్నాయని, త్వరలోనే తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సత్యేంద్ర జైన్ అన్నారు. అలాగే కోవిడ్‌తో ఆస్పత్రిల్లో చేరేవారి సంఖ్య నిలకడగా ఉందని, ముంబైలో కేసులు తగ్గినట్టే ఢిల్లీలోనూ అదే ట్రెండ్‌ని చూస్తామన్నారు. కోవిడ్ సోకిన వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతుందని చెప్పారు. కాగా ఢిల్లీలో కొన్నిరోజులుగా 20,000 నుంచి 22,000 కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కారణంగా ఒక్కరోజే 23 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు కారణంగా రాష్ట్రంలో ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాలని మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఆ సందర్భంగా లాక్‌డౌన్ ప్రకటిస్తారనే వార్తలని సీఎం ఖండించారు. లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ప్రజలు టెన్షన్ పడవద్దని చెప్పారు. అలాగే వైరస్ వ్యాప్తి తగ్గిందని అన్నారు. అక్కడ గత నెల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రెస్టారెంట్లు, బార్‌లు కూడా క్లోజ్ చేయబడ్డాయి.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM