భార్యల మార్పిడి కేసు వెనుక ప్రముఖుల పాత్ర

by సూర్య | Wed, Jan 12, 2022, 08:50 PM

కేరళ భార్య మార్పిడి లా కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనక ప్రముఖుల పాత్ర కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేరళలో వెలుగులోకి వచ్చిన భార్యల మార్పిడి వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతునన ఈ భాగోతం వెనుక పలువురు ప్రముఖుల పాత్ర కూడా ఉందని దర్యాప్తులో గుర్తించారు. కేరళ డీజీపీ అనిల్ కాంత్ పర్యవేక్షణలో సీనియర్ పోలీసు అధికారులు ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఇందులో ఉండటంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత మూడన్నరేళ్లుగా తనతో భర్త బలవంతంగా శృంగారం చేయించి డబ్బు సంపాదిస్తున్నాడంటూ కొట్టాయంలోకి కరుకాచల్ పట్టణానికి చెందిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా సభ్యుల కోసం వేట మొదలుపెట్టారు. మీట్ అప్ కేరళ, కేరళ కకోల్డ్, రియల్ మీట్ పేరిట సోషల్ మీడియా గ్రూపులను నిందితులు నిర్వహిస్తున్నట్టు వెల్లడయ్యింది. భర్త సమ్మతితోనే కొంతమంది వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 9 మంది గ్రూపు సభ్యుల ఫోన్ నంబర్లను కూడా తెలియజేసింది. దీంతో ఈ మొబైల్ నెంబర్ల నుంచి రికవరీ చేసిన ఛాట్‌లు, కాల్ వివరాలను విశ్లేషించి 14 సోషల్ మీడియా గ్రూపులను పోలీసులు గుర్తించారు.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM