ఈ నెల 12న విశాఖలో ఉద్యోగ మేళా
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్య అధికారి చాముండేశ్వరరావు తెలిపారు. ఇండస్ట్రీ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు ఎనలిస్టు పోస్టులకు బీటెక్(ఈసీఈ, సీఎస్ సీ, ఐటి, ఈఈఈ) ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు.


ఎంపికైన వారికి రూ. 2. 40 లక్షల వార్షిక వేతనం చెల్లించటం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బుధవారం ఉదయం 9 గంటలకు గురుద్వారా వద్ద అవ్య ఇవ్వెంట్రాక్స్ ప్రైవేటు లిమిటెడ్లో జరిగే ఇంటర్వ్యూలకుహాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు 9908590730, 8143229228 ఫోన్ నెంబరులో సంప్రదించాలని కోరారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM