విషాదం.. ఫ్యానుకు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
 

by Suryaa Desk |

విశాఖలోని ఎంవీపీ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎం. వి.పి. కాలనీ సెక్టార్-6లో దూడ ఉపేంద్ర, సుగుణ(24) కలిసి ఉంటున్నారు. ఉపేంద్ర ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం ఉదయం విధులు నిర్వహించి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఉపేంద్ర తలుపులు కొట్టినా సుగుణ తీయకపోవడంతో ఇంటి యజమానితో కలిసి ఇంటి వెనుక వైపు వెళ్లి చూడగా ఆమె ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని ఉంది.


అప్పటికే ఆమె మృతిచెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సి. ఐ రమణయ్య, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీ హెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
రూ.6400 కోట్ల‌తో ర‌హదారుల నిర్మాణం Sat, Jan 29, 2022, 04:25 PM
భారీగా గంజాయి పట్టివేత Sat, Jan 29, 2022, 04:19 PM
స్టీల్ ప్లాంట్ సమ్మె వాయిదా Sat, Jan 29, 2022, 04:04 PM
కర్నూల్ లో జనసేన లోకి చేరికలు Sat, Jan 29, 2022, 03:52 PM
చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే Sat, Jan 29, 2022, 03:47 PM