అలాంటి వారికి విడాకులు మంజూరు చేయాల్సిందే: హైకోర్టు

by సూర్య | Tue, Jan 11, 2022, 01:20 PM

దంపతులు తిరిగి ఒక్కటై కాపురం చేసే అవకాశాలు ఏమాత్రం లేనప్పుడు వారికి విడాకులు మంజూరు చేయకపోవడం దారుణం అని పంజాబ్-హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. విడాకుల కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై గురుగ్రామ్ కుటుంబ కోర్టు తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. పెళ్లైన ఓ జంట విడిపోయింది. వారిని తిరిగి కలిపేందుకు మధ్యవర్తిత్వం వంటి మార్గాల్లో జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో 2003 నుంచి వారు విడిగా ఉంటున్నారు. విడాకుల కోసం తొలుత భర్త కోర్టును ఆశ్రయించాడు. భార్యకు భరణం ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. కానీ భార్య అంగీకరించకపోవడంతో ఆయన పిటిషన్ను 2015 లో కోర్టు కొట్టివేసింది. తీర్పును సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో భార్యభర్తలు కలిసి ఉండే పరిస్థితి లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విడాకులు మంజూరు అయితే భర్త తన జీవితంలో ముందుకెళ్లగరుగుతారని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM