రైతులకు హెచ్చరిక..!

by సూర్య | Tue, Jan 11, 2022, 01:25 PM

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పదవ విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ డబ్బును తిరిగి ప్రభుత్వానికి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 7 లక్షల మంది అనర్హుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ అయినట్లు తెలుస్తోంది. వీరంతా తిరిగి చెల్లించాల్సి రావొచ్చని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇలా డబ్బులు వెనక్కి తిరిగి చెల్లించాల్సిన వారిలో యూపీలో ఎక్కువ మంది రైతులకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లిస్తుండటం లేదంటే ఇతర మార్గాల్లో డబ్బులు పొందటం వల్ల వీళ్లు స్కీమ్ అర్హత కోల్పోయినట్లు తెలుస్తోంది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఏటా రూ.6 వేలను మూడు దఫాలుగా రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM