ఆసుపత్రుల్లో కేసుల తీరు...డెల్టాలో 20-23 శాతం.. ఒమిక్రాన్ లో 5-10 శాతం

by సూర్య | Tue, Jan 11, 2022, 10:50 AM

ఇపుడు ఆసుపత్రికి వెళ్లున్నారా అంటే జ్వరమా...దగ్గువా, జలుబా అన్న ప్రశ్నలు వినిపంచడంలేదు. మీకు కరోనా వచ్చిందా...? లేక డెల్టా వైరసా..? ఒమిక్రాన్ సోకిందా అని ప్రశ్నించే పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య వేగంగా మారిపోవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారిపై పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. ఆసుపత్రుల్లో చికిత్సా సదుపాయాలను పెంచుకోవాలని.. అవసరమైతే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు, జూనియర్ రెసిడెంట్లు, నర్సింగ్ విద్యార్థులు, రిటైర్డ్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ సదుపాయాలను సిద్దంగా ఉంచుకోవాలని కోరారు. ప్రస్తుతం కేసుల పెరుగుదల ఒమిక్రాన్ వల్లేనని, డెల్టా కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోందని భూషణ్ చెప్పారు. ‘‘కరోనా రెండో విడతలో (డెల్టా వేరియంట్) మొత్తం పాజిటివ్ కేసుల్లో 20-23 శాతం వరకు ఆసుపత్రులలో చేేరిన పరిస్థితి చూశాం. ఒమిక్రాన్ రకంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారు 5-10 శాతంలోపే ఉన్నారు. పరిస్థితి మారుతోంది. కనుక ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగొచ్చు’’అని రాజేష్ భూషణ్ వివరించారు.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM