బిట్ కాయిన్ భారీ పతనం

by సూర్య | Tue, Jan 11, 2022, 10:25 AM

న్యూఢిల్లీ : క్రిపో దిగ్గజం బిట్ కాయిన్ పతనం కొనసాగు తోంది. డిజిటల్ టోకెన్లో దాదాపు సగం వాటా బిట్‌కాయిన్లే. ఇలాంటి క్రిపో మహా పతనం నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ మార్కెట్ భారీగా క్షీణించింది. ఇది 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువకు పడిపోయింది. అంచనాల కంటే ముందే యూఎస్ లిక్విడిటీ ఉప సంహరణ, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఇటు క్రిప్టో కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. బిట్ కాయిన్ సోమవారం 40వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తరువాత కోలుకున్నప్పటికీ.. 40,800 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. సెప్టెంబర్ 2021 తరువాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. 2022 క్యాలెండర్ ఇయర్ లో బిట్ కాయిన్ భారీగా పతనమైంది. గత కొన్నేళ్లలోనే బిట్ కాయిన్‌కు ఏడాది ప్రారంభంలో ఇది అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. నవంబర్ 10వ తేదీన బిట్ కాయిన్ 69,000 డాలర్ల స్థాయికి ఎదిగింది. ఈ స్థాయితో పోలిస్తే.. ప్రస్తుతం 40 శాతం పడిపోయింది. గత వారం రోజుల్లోనే 12 శాతం పడిపోయింది. గతంలో 2014,2018లలో బిట్ కాయిన్ భారీగా క్షీణించింది. అడపాదడపా ఆయా సంవత్సరాల్లోని కొన్ని


నెలల్లోనూ భారీ పతనం నమోదు చేసుకుంది. టెర్రా మాత్రం పైకి ఎగబాకింది. గ్లోబల్ క్రిప్టోమార్కెట్ క్యాప్ ఏకంగా 1.97 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. 2 ట్రిలియన్ డాలర్ల దిగువకు వచ్చింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 23 శాతం క్షీణించి 71.19 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బిట్ కాయిన్, సోలానా, కార్డానో, ఎక్స్ పీఆర్ భారీగా నష్టపోయాయి. అదే సమయంలో ఎథేరియం, బీఎ్బ, టెర్రా, పోల్కా డాట్ లాభపడ్డాయి. టెర్రా ఆరుశాతం మేర వృద్ధి చెందింది.

Latest News

 
నేడు పాతపట్నం నుండి నామినేషన్‌ దాఖలు చేయనున్న మామిడి గోవిందరావు Fri, Apr 19, 2024, 02:33 PM
అభివృద్ధి అంటే బూతులు తిట్టడం కాదు Fri, Apr 19, 2024, 02:32 PM
ప్రతి ఇంటికీ 4 సార్లు వెళ్లాలి Fri, Apr 19, 2024, 02:31 PM
అభ్యర్థుల మార్పు, కూటమిలో గందరగోళం Fri, Apr 19, 2024, 02:31 PM
ఎంఎస్‌ రాజుకు దక్కనున్న మడకశిర అసెంబ్లీ స్తానం Fri, Apr 19, 2024, 02:30 PM