వ్యాక్సినేషనే విరుగుడు...అందుకే కేంద్రాల సమయం పెంపు

by సూర్య | Tue, Jan 11, 2022, 01:00 AM

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  కేంద్రం కీలక నిర్ణయం  తీసుకొంది. వ్యాక్సినేషన్ కేంద్రాలను ఉదయం నుంచి రాత్రి పదిగంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయంం తీసుకొంది. కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి చెందడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. వైరస్ నివారణ టీకాతోనే సాధ్యం అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు హెల్త్ వర్కర్లు/ వయో వృద్దులు బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వ్యాక్సినేషన్ సమయాన్ని పొడిగించింది. రాత్రి 10 గంటల వరకు వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్ చేసి ఉంచాలని స్పష్టంచేసింది. వ్యాక్సినేషన్ కోసం జనాలు ఇంట్రెస్ట్ చూపితే రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ మనోహర్ అజ్ఞాన్నీ తెలిపారు. ఆయా సెంటర్లకు ఒక సమయం అంటూ ఏదీ లేదని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే 151.94 కోట్ల మందికి టీకాలను అందజేశారు. సోమవారం కరోనా కేసులు పెరిగాయి. 1.79 లక్షల కేసులు వచ్చాయి. 4033 ఒమిక్రాన్ కేసులు కూడా ఉన్నాయి. 7.23 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే 146 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4.83 లక్షలకు చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM