కరోనా కాటు...ఆర్థిక ఇబ్బందులు..అందుకే నార్వే ఆ ఆదేశాలిచ్చింది

by సూర్య | Mon, Jan 10, 2022, 11:49 PM

కరోనా కారణంగా ఆర్థిక  ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ఆశ్చర్య ఘటన ఓ దేశంలో నెలకొంది. కోవిడ్ కారణంగా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దేశాల్లోని వివిధ వ్యవస్థలపై కరోనా ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వాలు కరోనా కేసుల కట్టడి కోసం అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌‌ కూడా విధిస్తున్నాయి. దాంతో ఆర్థిక వ్యవస్థ చితికిపోతుంది. చాలా రంగాలకు అందాల్సిన సరుకులు, వస్తువులు అందడం లేదు. నార్వేలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దాంతో అక్కడ ఆర్మీ విచిత్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కోవిడ్ కారణంగా నార్వే సైన్యానికి వస్తువుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా లో దుస్తులు కొరత వెంటాడుతోంది. దాంతో ఆర్మీ కీలక ఆదేశాలను జారీ చేసింది. సర్వీసు ముగిసి వెళ్లిపోయే సైనికులు అప్పటి వరకూ వాడిన బ్రా‌లు, సాక్స్‌లను తిరిగి ఇవ్వాలని నార్వే ఆర్మీ ఆదేశించింది. అలా తిరిగి ఇచ్చిన లో దుస్తులను ప్రణాళిక ప్రకారం తర్వాత బ్యాచ్‌కు అందజేస్తుంది. తీవ్రమైన కొరత ఏర్పడడం వల్లే ఆర్మీ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నార్వే ప్రతి సంవత్సరం దాదాపు 8,000 మంది యువతీ యువకులను సైన్యంలో రిక్రూట్ చేసుకుంటుంది. ఆ ఏడాది ముగిశాక మరో బ్యాచ్‌ను తీసుకుంటుంది. అయితే కొత్తగా చేరిన వారికి ఆర్మీనే లో దుస్తులను అందజేసేది. వారి సర్వీస్ ముగిసి వెళ్లిపోయేటప్పుడు వారి లో దుస్తులను తిరిగి తీసుకునేది కాదు. కానీ వైరస్ కారణంగా ఆర్మీలో ఈ పరిస్థితి ఏర్పడింది. బలవంతంగా లో దుస్తులను అప్పగించమని కోరినట్లు తెలుస్తోంది. ఆ లో దుస్తులను శుభ్రం చేసి తర్వాత వచ్చే బ్యాచ్‌కు అందజేస్తారు. తగినంత స్టాక్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM