డ్యాన్స్ కొంపముంచింది...కోపంత విడాకులిచ్చిన పెళ్లి కొడుకు

by సూర్య | Mon, Jan 10, 2022, 11:51 PM

డుగు డుగ్గు బండి పాట పెళ్లి డ్యాన్స్ ఇపుడు కొత్త ఆచారంగా మారింది. అదే ఆచారం ఓ పెళ్లిలో చిచ్చుపెట్టింది. తమ వివాహ వేడుకల్లో పెళ్లి కూతుర్లు డ్యాన్స్‌లు వేయడం చాలా కామన్. అందులోనూ ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ మరీ పెరిగింది. వధువులు డ్యాన్స్ వేసి.. అందరిలో హుషారును పెంచుతున్నారు. అలా తన పెళ్లి వేడుకల్లో ఓ వధువు ఉత్సాహంగా ఓ పాటకు నర్తించింది. అంతే వరుడు కోపంతో ఊగిపోయి.. వెంటనే విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన ఇరాక్‌లో జరిగింది.పెళ్లైన కొత్త జంట పెళ్లిలోనే విడాకులు తీసుకున్నారు. పెళ్లి కూతురు ఓ సిరియన్ పాటకు డ్యాన్స్ చేయడంతో వరుడు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ వ్యక్తి ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అట్టహాసంగా జరిగింది. పెళ్లి వేడుకల్లో బాగంగా కొత్త పెళ్లికూతురు ఓ సిరియన్ పాటకు డ్యాన్స్ వేసింది. సిరియన్ గాయకుడు లామిస్ కాన్ రచించిన సిరియన్ పాట అది. అయితే ఆ పాట రెచ్చగొట్టే విధంగా ఉందంటూ వరుడు.. వధువుతో వాగ్వాదానికి దిగాడు. ఆ పాటతో వరుడు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నాడు. ఆ క్షణంలో భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో అక్కడ ఈ విషయం చర్చానీయాంశం అయింది. కాగా ఆ దేశంలో అత్యంత వేగవంతమైన విడాకుల కేసు ఇదేనని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే పాటల కారణంగా విడాకులు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఓ జోర్డాన్ వ్యక్తి తన పెళ్లి వేడుకల సందర్భంగా ఇదే పాటను ప్లే చేయడంతో తన భార్యతో విడిపోయాడు. లెబనాన్‌లో కూడా ఓ పాట కారణంగా కోపగించుకున్న వరుడు తన భార్యను వదిలేశాడు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM