మండలి రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయవద్దు : ఎంపీ పిల్లి సుభాష్‌
 

by Suryaa Desk |

శాసన మండలి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు .మండలి రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయవద్దు అని అన్నారు . అది ప్రభుత్వ విధానం అని తెలిపారు . మండలిలో మూడు రాజధానుల బిల్లులో అప్పటి చైర్మన్ నిబంధనల ప్రకారం నడుచుకోలేదని సుభాష్‌ తెలిపారు. తెలుగుదేశం  కి చెందిన వ్యక్తే మండలి చైర్మన్‌గా ఉన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సెలెక్ట్ కమిటీకి చైర్మన్ పంపలేదు. మండలిని రద్దు చేయాలని కోరుతూ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి భారీ మెజారిటీ ఉండడంతో తిరిగి మండలిని రద్దు చేయరాదని అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM