మండుతున్న కూరగాయల ధరలు

by సూర్య | Wed, Nov 24, 2021, 01:29 PM

దేశవ్యాప్తంగా  కూరగాయల ధరలు  మండిపోతున్నాయి.ఏం కొనాలన్నా.. కేజీ 60 రూపాయల పైనే  పలుకుతోంది.టమాటా అయితే పెట్రోల్‌కు మించి స్పీడ్‌గా దూసుకెళ్తొంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సెంచురీ దాటేసింది. హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతుండగా*.. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది. నెల మొదట్లో రూ.20నే ఉంది. నవంబర్ నెల మొదట్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.40 మధ్యనే ఉంది. అయితే కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే టమాట రేటు ఆకాశాన్నంటింది.


 


దీనికి ప్రధాన కారణం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలేనని వ్యాపారులు అంటున్నారు.దేశంలోనే అత్యధికంగా టమాటాలు పండే  ప్రాంతం ఆంధ్రప్రదేశ్.అక్కడ లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది.అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది.ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట డ్యామేజీ కావడం, ఉన్న పంట రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.మరో నెల రోజుల తర్వాత గానీ టమాటా రేటు తగ్గడం కష్టమని వ్యాపారులు చెబుతున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లాంటి  ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వస్తున్న టమాటా.. మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌‌ల నుంచి మాత్రమే వస్తున్నట్లు చెబుతున్నారు.


 


 


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM