పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'

by సూర్య | Mon, Nov 22, 2021, 02:46 PM

భారత వైమానిక దళ గ్రూప్ కమాండర్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు వీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వం.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు అభినందన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. 2019, ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడి దాయాదుల ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చారు.దివంగత నాయబ్ సుబేదార్ సోంబీర్‌కు శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వం. A++ కేటగిరీ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ ఆపరేషన్‌లో హతమార్చినందుకు ఈ అవార్డును ప్రకటించారు.ఈస్ట్రన్ ఆర్మీ కేడర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ (రిటైర్డ్), ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, దక్షిణ నేవీ కమాండర్ వైస్ అడ్మిరల్ అనిల్ చావ్లాలకు పరమ విశిష్ట సేవ మెడల్‌ను ప్రదానం చేశారు. ఈస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ దిలీప్ పట్నాయక్‌కు అతి విశిష్ట సేవా మెడల్ బహుకరించారు.


 


 


 

Latest News

 
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM