కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది

by సూర్య | Mon, Nov 22, 2021, 02:28 PM

మహిళ ఓ వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అతడు లైంగిక సంబంధం పెట్టుకోవడానికి అంగీకరించినట్లు కాదని స్పష్టం చేసింది. ఆమె అందుకు ఒప్పుకుందని ఊహించుకోవడం ఎంతమాత్రమూ సరికాదని తెలిపింది. ఆమెను బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అది కిడ్నాప్‌తోపాటు అత్యాచారం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ నారాయణ తీర్పు ఇచ్చారు.నిస్సహాయ స్థితిలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె లైంగిక సంబంధంలో పాల్గొంటే అది అంగీకారం కిందికి రాదని, అంగీకారానికి.. లొంగుబాటుకు తేడా ఉందన్నారు. ప్రేమిస్తున్నంత మాత్రాన ఆమె అన్నింటికీ అంగీకరిస్తున్నట్లుగా భావించకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగలు విక్రయించి మళ్లీ గోవా తీసుకెళ్లాడు. అక్కడ కూడా మరోసారి అత్యాచారం చేశాడు.


 


వీటన్నింటికీ అంగీకరించకపోతే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమె వెళ్లకతప్పలేదు. దీనిపై కేసు నమోదవ్వగా.. ఆమె ఎక్కడా ప్రతిఘటించలేదని, అంతా అంగీకారంతోనే జరిగిందని నిందితుడు వాదించాడు. దీన్ని అంగీకరించని ట్రయల్ కోర్టు అతనికి అత్యాచారం నేరం కింద శిక్ష విధించింది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా, కింది కోర్టు తీర్పును సమర్థించింది. బాధితురాలి వయసు నిర్ధరణ కాకపోవడంతో పోక్సో చట్టం కింద విధించిన శిక్షను మాత్రం రద్దు చేసింది.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM