చంద్రబాబు ఫ్రెస్టేషన్ లో ఉన్నారు : సీఎం జగన్

by సూర్య | Fri, Nov 19, 2021, 02:32 PM

టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పైన శాసనసభలో సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా కుటుంబ సభ్యులు గురించి ఎవరూ ప్రస్తావించలేదని.  ఆయన చెబుతున్న వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని సీఎం జగన్ స్పష్టం చేసారు. చంద్రబాబు ఫ్రెస్టేషన్ లో ఉన్నారని చెప్పారు.ఆ విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి రెచ్చగొట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. కుప్పం ఫలితాలే దానికి నిదర్శనమని సీఎం చెప్పుకొచ్చారదు. అదే విధంగా చంద్రబాబు నిర్ణయం పైన సభలో మంత్రులు సైతం స్పందించారు. త‌న‌పైన‌, త‌న కుటుంబంపైనా స‌భ‌లో వైసీపీ నేత‌లు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని, త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది పెట్టార‌ని, రెండున్న‌రేళ్లుగా ఎన్నోఅవ‌మానాలు భ‌రించాన‌ని, మ‌ళ్లీ స‌భ‌లోకి అడుగుపెడితే అది ముఖ్య‌మంత్రిగానే అని చెప్పి స‌భ‌నుంచి వెళ్లిపోయారు.


 


ఆ తరువాత మంత్రులు బొత్సా.. కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు సతీమణి గురించి ఎవరూ వ్యాఖ్యలు చేయలేదని…టీడీపీ ఎమ్మెల్యేలు బాబాయ్ గొడ్డలి అంటూ నినాదాలు చేయటంతో…చంద్రబాబు హయాంలో జరిగిన వంగవీటి రంగా.. మాధవరెడ్డి హత్యల గురించి కూడా విచారణ చేయాలనే తాము కోరామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఈ రోజు ఇలా వ్యవహరించాలని గురువారం రాత్రి తన నివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలోనే నిర్ణయించారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఇదంతా సానుభూతి కోసం ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. చంద్రబాబుకు శాసనసభకు రానని చెప్పటం ద్వారా ఇక, రాజకీయ నిష్క్రమణే అంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబు మాత్రం తాను ప్రజాక్షేత్రంలో గెలిచిన తరువాతనే అసెంబ్లీకి వెళ్తానంటూ ప్రకటించారు.


 

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM