న్యూడ్ వీడియో కాల్స్.. మోసపోయిన 200 మంది!

by సూర్య | Wed, Oct 27, 2021, 08:04 AM

యూపీలో ఓ జంట నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ దాదాపు 200 మందిని మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘాజియాబాద్‌ కు చెందిన సప్నాగౌతమ్‌, యోగేశ్‌ దంపతులు ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి న్యూడ్ వీడియో కాల్స్ రికార్డు చేసి బాధితుల నుంచి డబ్బులు లాగొచ్చని సలహా ఇచ్చాడు. దీంతో సప్నా గౌతమ్‌, యోగేశ్‌ జంట ఈ దందాలోకి దిగింది. యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించేవాడు. వీడియో కాల్స్ ఎలా మాట్లాడాలో కొంతమంది యువతులకు సప్నా ట్రైనింగ్ ఇచ్చింది. వీరు ముందుగా ఓ వెబ్ సైట్ సాయంతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేవారు. నిమిషానికి రూ.200పైగా చెల్లించాలని చెప్పేవారు. ఇందులో సగం వెబ్ సైట్ వారికిపోగా మిగిలిన సగం ఈ దంపతులకు చేరుతుంది. తర్వాత ఆ రేటు కంటే తక్కువకే తాము వీడియో కాల్స్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించేవారు. వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల్లో వీడియో కాల్స్ చేసి, అవతలి వారు నగ్నంగా మాట్లాడుతుండగా వీడియో రికార్డు చేసేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే వీడియోలు బయట పెడతామని బెదిరించేవారు. ఇలా ఎంతో మందిని మోసం చేసి గత రెండేళ్లుగా సుమారు రూ.22 కోట్లను పలువురు బాధితుల నుంచి దోచుకున్నారు. యువతులను రిక్రూట్ చేసుకుని వారికి నెలకు రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లించి న్యూడ్ వీడియో కాల్స్‌ మాట్లాడించేవారు. కేవలం మెసేజ్​లు చేసే వారికి నెలకు రూ.15 వేలు ఇచ్చేవారు. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫేర్ చేయడంతో ఆ కంపెనీ యజమాని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. కేసు విచారణలో రాజ్‌కోట్‌ పోలీసులు ఘజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేస్తుంటే హనీ ట్రాప్ విషయం బయటపడింది. ఈ కేసులో భార్యాభర్తలు సహా, మరో ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు.

Latest News

 
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM