న్యూజిలాండ్‌ పై పాక్‌ విజయం

by సూర్య | Wed, Oct 27, 2021, 07:46 AM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం షార్జా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 33, ఆసిఫ్‌ అలీ 27*, షోయబ్ మాలిక్ 26* పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సోధీ 2, శాంటర్న్, టిమ్‌ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో రవూఫ్‌ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. హాఫీజ్‌, ఇమాద్ వసీమ్, షాహీన్ ఆఫ్రిది తలో వికెట్‌ పడగొట్టారు.

Latest News

 
గజ వాహనంపై ముక్తిరామలింగేశ్వరుడు Tue, Apr 30, 2024, 10:50 AM
వైసిపి మద్దతుదారునపై కత్తులతో దాడి Tue, Apr 30, 2024, 10:28 AM
ఎన్డిఏ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Tue, Apr 30, 2024, 10:18 AM
అరటిపండ్ల మాలతో టీడీపీ అభ్యర్థికి వినూత్న స్వాగతం Tue, Apr 30, 2024, 10:14 AM
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM