టీ20 ప్రపంచకప్‌: పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా పాకిస్థాన్

by సూర్య | Tue, Oct 26, 2021, 07:50 PM

టీ20 ప్రపంచకప్‌లో డబుల్ హెడర్స్‌లో భాగంగా రెండో మ్యాచులో గ్రూపు2లో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (PAK vs NZ)తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించిన పాక్ జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పాకిస్థాన్ జట్టుకు నేటి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచులో గెలిస్తే దాదాపుగా సెమీస్‌లో చోటు ఖాయం కానుంది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆ జట్టుపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ జట్టుపై గెలిచి తగిన బుద్ది చెప్పాలని పాకిస్తాన్ కోరుకుంటుంది.


పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది.


న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, టిమ్ సీఫెర్ట్(కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM