విద్యార్థుల విన్నపాలను అర్థం చేసుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి : చంద్రబాబు

by సూర్య | Tue, Oct 26, 2021, 05:59 PM

బడిలో ఉండాల్సిన విద్యార్థులను సీఎం జగన్ రెడ్డి బజారున పడేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మా బడులు మాకు కావాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. విద్యార్థుల విన్నపాలను అర్థం చేసుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యా వ్యవస్థ మనుగడకు గొడ్డలిపెట్టన్నారు. ఆస్తులు అప్పగించని ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసేందుకు తెచ్చిన జీవో.42ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సాయాన్ని నిలిపేయడంతో పేద విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను, సిబ్బంది జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం మంచిదికాదన్నారు. లేదంటే తల్లిదండ్రులు, విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం తప్పదన్నారు.


 

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM