డిసెంబరు 1 నుంచి అమల్లోకి కొత్త ధరలు

by సూర్య | Tue, Oct 26, 2021, 09:18 AM

అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.1 కి లభించిన అగ్గిపెట్టె ఇకపై రూ.2 లకు లభించనుంది. అగ్గిపెట్టెలను డిసెంబరు 1 నుంచి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరిగాయని, అందుకే అగ్గిపెట్టె ధర కూడా పెంచుతున్నట్లు వివరించాయి. రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810 కి, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని పేర్కొన్నాయి. బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, గంధకం వంటి ధరలు కూడా పెరిగాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇంధన ధరల వల్ల రవాణా ఛార్జీలు కూడా భారమయ్యాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని నిర్ణయించాయి. ఒక అగ్గిపెట్టె ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచుతూ 2007లో నిర్ణయం తీసుకోగా, మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు.

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM