ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

by సూర్య | Tue, Oct 26, 2021, 08:55 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.50 వేల చొప్పున సాయం అందించనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి వీటిని మంజూరు చేయడానికి కలెక్టర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో డీఆర్వో ఆధ్వర్యంలో ఓ సెల్‌ ఏర్పాటు చేసి, కరోనా మృతుల కుటుంబీకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిని పరిశీలించి కలెక్టర్‌కు సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత 2 వారాల్లో సాయం అందించనున్నారు. దరఖాస్తులో స్థానిక ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎం, వైద్యాధికారి సంతకాలు కూడా అవసరమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Latest News

 
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM