భారత్ లో అత్యంత సంపన్న మహిళగా రికార్డు

by సూర్య | Mon, Oct 25, 2021, 07:06 PM

పురాణాల్లో సావిత్రి అంటే భర్తే లోకంగా బతికే ఓ మహిళ. భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ సావిత్రి ఏకంగా యముడితోనే పోరాటం చేసి విజయం సాధించింది. కానీ ఈ సావిత్రి భర్త ప్రాణాలతో సమానమైన అతని ఆశయాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. అంతేకాదు దేశంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన జిందాల్‌ గ్రూపుకి చుక్కానిలా మారింది. 14 లక్షల కోట్లకు పైగా సంపదతో దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా రికార్డులెక్కింది.


ఇటీవల ఫోర్బ్స్‌ సంస్థ ప్రకటించిన ధనవంతులైన మహిళల జాబితాలో సావిత్రి జిందాల్‌ రూ. 13.46 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఏడాది ఆమె సంపద విలువ 9.72 లక్షల కోట్లు. ఏడాదిలో తన కంపెనీ విలువని 3.34 లక్షల కోట్ల మేరకు పెంచగలిగారు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థంగా నిర్వ‍్వహిస్తున్న సావిత్రీ ఏ బిజినెస్‌ స్కూల్‌లోనూ చదువుకోలేదు. ఆ మాటకొస్తే పెద్దగా కాలేజీకి వెళ్లింది కూడా లేదు. తొమ్మిది మంది పిల్లల తల్లిగా యాభై ఏళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. ఒక్కసారిగా 55 ఏళ్ల వయస్సులో కార్పొరేట్‌ వరల్డ్‌లోకి అడుగు పెట్టారు. ఎవ్వరూ ఊహించలేని విజయాలను సాధించారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM