కోరిక తీర్చాలంటూ.. బాలింత పై రెచ్చిపోయిన వలంటీర్..

by సూర్య | Mon, Oct 25, 2021, 07:43 PM

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో ఓ వలంటీర్ రెచ్చిపోయాడు. బాలింత అని కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న బాలింత భయంతో రోడ్డుపైకి పరుగులు తీసింది. ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించిన ఆ వలంటీర్ అక్కడ నుంచి నెమ్మదిగా ఉడాయించాడు.


పిల్లుట్ల గ్రామంలో వివాహితపై వలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. ఒంటరిగా ఉన్న బాలింతను కామవాంఛ తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో భయపడిన మహిళ బయటకు పరుగులు తీసింది. ఎవరికైనా చెబితే ఊళ్లో తిరగలేవంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వలంటీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM