ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి: సీఎం వైఎస్‌ జగన్‌

by సూర్య | Mon, Oct 25, 2021, 05:53 PM

 ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం లో మాట్లాడుతూ.. 


►మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ అన్నది నిరంతరం కొనసాగాలి.


►కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలి. అప్పుడు ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయి.


►ఎడ్యుకేషనల్‌గా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటి అన్నది కనిపించాలి.


►ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి. జాబ్‌ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలి.


►ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాం.


►చదువులున్నా.. ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం.


►అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండలి.


►ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకు వస్తున్నాం.


►సర్టిఫైడ్‌కోర్సులను కరికులమ్‌లో భాగంగా చేయాలి.


►ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండి.


►చదువులు అయిపోయిన తర్వాత కచ్చితంగా జాబ్‌వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి.


►యూనివర్శిటీల్లో టీచింగ్‌స్టాఫ్‌ను రిక్రూట్‌చేయమని ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ఇచ్చాం.


►టీచింగ్‌స్టాఫ్‌లేనప్పుడు యూనివర్శిటీలు ఉన్నా.. లాభం ఏంటి.


►రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదు.


►టీచింగ్‌స్టాఫ్‌లో క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేకపోతే.. రిక్రూట్‌చేసినా అర్థం ఉండదు.


►అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి. అత్యంత పారదర్శకంగా నియమాకాలు సాగాలి.


►క్వాలిటీ ఎడ్యుకేషన్‌కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలి.


 


జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం


►ఆస్పత్రులను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం.


►అలాగే ప్రతి యూనివర్శిటీ పరిధిలోకూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి.


►కాలేజీలన్నీ కూడా ఆయా ప్రమాణాలు పాటించేలా చూడాలి.


►ఎన్ని సమస్యలున్నా సరే.. ఫీజు రియింబర్స్‌మెంట్‌విషయంలో ఎక్కడా లోటు చేయడంలేదు.


►ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా జీతాలు ఇస్తున్నాం.


►ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంవల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాలనుంచి రాకుండా చూసుకుంటున్నాం.


►తల్లుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం.


►కాలేజీల్లో పరిస్థితులపై నేరుగా వారు ప్రశ్నిస్తున్నారు.


►యూనివర్శిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఫీజురియింబర్స్‌మెంట్‌ఫీజులు కూడా ఇస్తాం.


►ఇతర ప్రైవేటు కాలేజీల్లానే సమానంగా ఫీజులు చెల్లిస్తాం.


►దీనివల్ల ఆర్థికంగా యూనివర్శిటీలు స్వయం స్వయంసమృద్ధి సాధిస్తాయి.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM