అమరావతి రైతుల పాదయాత్ర-అనుమతిపై డీజీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

by సూర్య | Mon, Oct 25, 2021, 05:48 PM

అమరావతి రాజధాని తరలింపుకు నిరసనగా దాదాపు రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్న రైతులు నవంబర్ 1న మహా పాదయాత్రకు సిద్దమయ్యారు. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే దీనికి అనుమతిచ్చే విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.


నవంబర్ 1న తాము చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీ గౌతం సవాంగ్ కు రైతులు వినతి పత్రం ఇచ్చారు. అయినా దీనిపై డీజీపీ స్పందించకపోవడంతో రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కు అనుమతి పై ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. రైతుల పాదయాత్రకు అనుమతి ఇచ్చే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియజేయాలని హైకోర్టు డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది.


నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకూ రైతులు అమరావతిలోని నేలపాడు వద్దనున్న హైకోర్టు నుంచి తిరుమల వరకూ ఈ న్యాయస్ధానం నుంచి దేవస్ధానం వరకూ పేరుతో మహాపాదయాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించిన డిసెంబర్ 17న తిరుమలలో ఈ యాత్ర ముగించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే అమరావతి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న ప్రభుత్వం.. పాదయాత్రకు అనుమతిస్తే తలెత్తబోయే పరిణామాలపైనా ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM