తాలిబన్ల కొత్త నిర్ణయం

by సూర్య | Mon, Oct 25, 2021, 05:32 PM

కొన్ని నెలల క్రితం వరకు అభివృద్ధి వైపు మెల్లిమెల్లిగా అడుగులేసిన అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో చనిపోవడం అక్కడి దీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో అఫ్గాన్‌ ప్రజలను ఆదుకునేందుకు అక్కడి తాలిబన్ ప్రభుత్వం తాజాగా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగం, ఆకలి చావులను నిరోధించేందుకు గాను ‘పనికి గోధుమల పంపిణీ’ని ప్రారంభించింది. అంటే పని చేసిన వారికి వేతనం బదులుగా గోధుమలను పంపిణీ చేయనుంది.


ఆకలి చావులను అరికట్టేందుకే!


ఇప్పటికే పేదరికం, కరువు, కరెంటు కోతలు..తదితర సమస్యలతో కుదేలవుతోన్న అఫ్గాన్‌ ప్రజలకు శీతాకాలం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో తాలిబన్లు ముందు జాగ్రత్తగానే ఈ గోధుమల పంపిణీని ప్రారంభించారు. అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ అధికారికంగా గోధుమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అఫ్గాన్‌ వ్యవసాయ మంత్రి అబ్దుల్‌ రెహ్మాన్‌ రషీద్‌, కాబూల్‌ మేయర్‌ హమ్‌దుల్లా నొమాని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబూల్‌లోనే కాకుండా హెరాత్‌, జలాలాబాద్‌, కాందహార్‌, మజారే షరీఫ్‌ తదితర నగరాలు, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తాలిబన్లు తెలిపారు. అదేవిధంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు విస్తృతంగా కాలువల నిర్మాణం చేపడతామన్నారు.

Latest News

 
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM
యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు Sun, May 19, 2024, 07:32 PM
వేరుశనగ విత్తనాలకు దరఖాస్తులు చేసుకోండి Sun, May 19, 2024, 07:08 PM
సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం నేతలు Sun, May 19, 2024, 07:05 PM