టీమిండియా ఓడిపోవడం మంచిదే అయ్యింది.. ఎందుకంటే..

by సూర్య | Mon, Oct 25, 2021, 03:15 PM

 టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలోని తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మేలే చేస్తుందని ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అన్నాడు. అపజయాలు విజయాలకు బాటలు వేస్తాయని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 24న పాకిస్తాన్‌తో దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేనకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్‌ చేతిలో అపజయం ఎరుగని భారత జట్టు అనూహ్యంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.


 


ఈ నేపథ్యంలో గ్రేమ్‌ స్వాన్‌ క్రికెట్‌.కామ్‌తో మాట్లాడుతూ.. ''కొన్ని సార్లు టోర్నీ ఆరంభంలోనే భారీ తేడాతో ఓడిపోవడం మంచే చేస్తుంది. ఎందుకంటే... ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని.. పడిలేచినా కెరటంలా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే కదా ఐపీఎల్‌ ముగిసింది. వాళ్లు(టీమిండియా ఆటగాళ్లు) అలసిపోయి ఉన్నారు. అయితే, ప్రతి ఒక్కరు టీమిండియానే ఫేవరెట్‌ అంటున్నారు. వాళ్లు ఓటమి నుంచి త్వరగానే కోలుకుంటారు. ముందుకు సాగుతారు'' అని చెప్పుకొచ్చాడు.ఇక పాకిస్తాన్‌ ప్రదర్శన గురించి చెబుతూ... ''వాళ్లు చాలా చాలా డేంజర్‌ టీమ్‌. అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవచ్చు లేదంటే... ప్రతి మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించనూ గలదు. అంతే సులువుగా టోర్నమెంట్‌ గెలవనూగలదు. పాకిస్తాన్‌ నిజంగా ప్రమాదకర జట్టు'' స్వాన్‌ అభిప్రాయపడ్డాడు.


 


 

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM