టెన్త్ పాసైన వారికి శుభవార్త..

by సూర్య | Mon, Oct 25, 2021, 03:07 PM

ఇండియన్ నేవీ  లో చేరాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో సెయిలర్ మెట్రిక్ రిక్రూట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ  అక్టోబర్ 29న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నవంబర్ 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ (Online) విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో 1500 మందిని రాత పరీక్ష (Written Test), ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్(PFT), మెడికల్ స్టాండర్డ్స్ కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. అన్ని రౌండ్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు INS Chilkaలో 12 వారాల పాటు శిక్షణ ఉంటుంది.


 


విద్యార్హతల వివరాలు: గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఆయా ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.


వయో పరిమితి: ఏప్రిల్ 1, 2002 నుంచి సెప్టెంబర్ 30, 2025 మధ్యలో జన్మించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


 


ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..


Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.


Step 2: అనంతరం Candidate Login ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


Step 3: ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


 


Step 4: అనంతరం రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి. తర్వాత 'Current Opportunities' సెక్షన్ లోకి వెళ్లాలి.


Step 5: అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపి కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.


Step 6: నమోదు చేసిన వివరాలను ఓ సారి సరి చూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.


 


ఎంపిక ప్రక్రియ:


అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ఉంటుంది. సైన్స్, మాథ్స్, జనరల్ నాలెడ్జ్ కు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అదే రోజు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ కు హాజరుకావాల్సి ఉంటుంది.


 


వేతనం:


ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.14,600 ఉపకార వేతనం ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన అనంతరం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు వేతనం ఉంటుంది.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM