చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలి : రామనారాయణరెడ్డి

by సూర్య | Mon, Oct 25, 2021, 01:37 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలన్నారు. ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్‌కు పంపేందుకు జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబుకు ఎమ్మెల్యే అందజేశారు.అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సభ్య సమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోందన్నారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జనాగ్రహ దీక్షలో టీడీపీకి తీరుకి నిరసనగా గవర్నర్‌ లేఖ కోసం సంతకాలు సేకరించామని ఆయన తెలిపారు.

Latest News

 
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM