రాష్ట్రపతి పాలన విధించకపోతే ఏపీ సర్వనాశనం అవుతుంది : చంద్రబాబు

by సూర్య | Mon, Oct 25, 2021, 02:12 PM

టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేట్రేగిపోతోందని అన్నారు.డ్రగ్స్ వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైకోర్టు జడ్జీలతో పాటు ఇతర రంగాలపై దాడులు చేశారని అన్నారు. రాష్ట్ర సహజ సంపదను, వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నానాటికీ రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతోందని అన్నారు. ఏపీలో పరిస్థితులు మరింత ఘోరంగా తయారవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్రపతిని కోరామని చెప్పారు.


 


 

Latest News

 
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM
కేజీఎఫ్ -3 ఏపీలోనే ఉంది.. చంద్రబాబు Sat, Apr 20, 2024, 07:16 PM