నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నా టీడీపీ నేతలు

by సూర్య | Sun, Oct 24, 2021, 11:22 AM

రేపు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారైన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నేతలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం అచ్చం నాయుడు, కేశినేని నాని ఇతర నేతలు బయలుదేరనున్నారు. రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంత మంది నేతలు ఢిల్లీకి పయనం కానున్నారు. 


రేపు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భారత రాష్ట్రపతితో టీడీపీ నేతలు భేటీ అవనున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత చంద్రబాబు హస్థినకు వెళుతున్నారు. హోం మంత్రితో పాటు మరికొందరిని కూడా కలిసే అవకాశం ఉంది. రెండు రోజులపాటు చంద్రబాబు బృందం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసంపై ఢిల్లీలో నేతలకు బృందం సభ్యులు వివరించనున్నారు. టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసం, అక్రమ కేసులు వంటి అంశాలను టీడీపీ బృందం కేంద్ర పెద్ద దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM