ఇండియాని ఓడిస్తే పాకిస్తాన్‌ క్రికెటర్లకు బ్లాంక్ చెక్ రెడీ: పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డ్‌ చైర్మన్‌

by సూర్య | Sat, Oct 23, 2021, 07:05 PM

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఇరు దేశాల అభిమానులకు పండగే. ఈ రెండు దేశాలు ఎప్పుడు ఢీకొన్నా థ్రిల్లింగ్‌ పీక్స్‌లో ఉంటుంది. టీ 20 వరల్డ్‌ కప్‌లో భాగంగా అక్టోబర్ 24న మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి. దాయాదుల పోరు కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత ఇరు జట్లు మళ్లీ తలపడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఓ యుద్ధం లాంటిది. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగిందంటే ఫ్యాన్స్ ఓ యుద్ధం జరిగినట్లుగా ఫీల్ అవుతారు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తారు.


అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డ్‌ చైర్మన్‌ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్.. ఇండియాని ఓడిస్తే ఆటగాళ్ల కోసం బ్లాంక్ చెక్ రెడీగా ఉందని ప్రకటించారు. పీసీబీని బలోపేతం చేసేందుకు ఓ ఇన్వెస్టర్ ఈ ఆఫర్ ఇచ్చారని రమీజ్ రాజా తెలిపారు. అయితే ఐసీసీ ఇస్తున్న 50 శాతం నిధులతోనే ప్రస్తుతం పీసీబీ బోర్డు నడుస్తోంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.


సీసీకి 90 శాతం నిధులు బీసీసీఐ నుంచి అందుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ బీసీసీఐ నిధులు ఇవ్వడం ఆపేస్తే అటు ఐసీసీ, పీసీబీ బోర్డు కుప్పకూలే ప్రమాదముందని వెల్లడించారు. పీసీబీ బోర్డు చైర్మన్ ప్రకటనతో పాక్ క్రికెటర్లు ఎలాగైనా ఈ మ్యా్చ్‌లో గెలవాలని ఉవ్విళ్లురుతూ ఉండగా, ఎన్నో ఏళ్లుగా దాయాది జట్టుతో మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీం ఇండియా సైతం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM