ఫెస్టివల్‌ సీజన్‌లో బైక్‌ కొనే వారికి యమహా గుడ్‌న్యూస్‌...!

by సూర్య | Sat, Oct 23, 2021, 03:57 PM

కొత్తగా బైక్లను కొనే వారికి ప్రముఖ జపానీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం యమహా గుడ్‌న్యూస్‌ను అందించింది. ఫెస్టివల్‌ సీజన్‌లో భాగంగా యమహా స్కూటీలపై సుమారు రూ. 4000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ ఆఫర్‌ యమహా 125సీసీ స్కూటీ రేంజ్‌పై అందుబాటులో ఉండనుంది. ఫాసినో 125 ఎఫ్‌ఐ(హైబ్రిడ్‌+నాన్‌ హైబ్రిడ్‌), రే జెడ్‌ఆర్‌ 125ఎఫ్‌ఐ, రే జెడ్‌ ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ(హైబ్రిడ్‌+నాన్‌ హైబ్రిడ్‌) మోడల్‌ స్కూటీలపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ లభించనుంది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనుంది.


యమహా స్కూటీ ధరలు ఇలా..(ఎక్స్‌షోరూమ్‌ ధరలు)


యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ(హైబ్రిడ్‌+నాన్‌ హైబ్రిడ్‌) ధర రూ. 78,530


రే జెడ్‌ ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ధర రూ. 79,830


యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ ఫీచర్స్‌..


యమహా బ్లూ కోర్ ఇంజన్ టెక్నాలజీతో కొత్త BS-6-మోడల్‌ ఫాసినో రానుంది, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ (Fi), 125 cc ఇంజిన్‌ను అమర్చారు. 5000 ఆర్‌పీఎమ్‌వద్ద 10.3 ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఈ బైక్‌ సుమారు 66కెఎమ్‌పీఎల్‌ మైలేజీను ఇస్తుంది.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM