యుపి ఎన్నికల అభ్యర్ధుల పరిశీలనపై సమావేశం కానున్న కాంగ్రెస్‌ సిఇసి

by సూర్య | Sat, Oct 23, 2021, 11:34 AM

రానున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల పరిశీలన నిమిత్తం కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) శనివారం సమావేశం కానుంది. ఈ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరగనుంది. 150 అసెంబ్లీ స్థానాలను సరైన అభ్యర్థులను కాంగ్రెస్‌ పరిశీలించనుంది. ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయిల్లో సన్నాహకాలను పార్టీ ప్రారంభించింది. 'శిక్షణ నుండి పరాక్రమం వరకు' అనే నినాదంలో కార్యకర్తలకు శిక్షణిస్తోంది.


ఇప్పటికే రెండు స్థాయిల్లో ఈ శిక్షణ పూర్తైనట్లు సమాచారం. కాగా, వచ్చేవారంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ఆఫీస్‌ బేరర్స్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. కాగా, ఆమె శనివారం రాష్ట్రంలో మూడు ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో 40 శాతం స్థానాలను మహిళలకే కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి విదితమే. అదేవిధంగా 12వ తరగతి విద్యార్ధినులకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ చదువుతున్న విద్యార్ధినులకు ఎలక్ట్రానిక్‌ స్కూటర్లను ఇస్తామని హామీలను గుప్పించారు. కాగా, మరిన్ని తాయిలాలను కూడా శనివారం ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM