తెలుగుదేశం నేత ప్రకాశ్‌ నాయుడు దౌర్జన్యం

by సూర్య | Sat, Oct 23, 2021, 11:41 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికి.. పచ్చ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదు. తాజాగా టీడీపీ నేత ఒకరు మహిళపై బెదిరింపులకు దిగారు. ఆ వివరాలు.. చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మహిళపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వీడియో ఒకటి శనివారం వెలుగులోకి వచ్చింది.అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల సోమశేఖర్ నాయుడును కారుతో గుద్ది చంపేందుకు యత్నించారంటూ ప్రకాశ్‌ నాయుడి సోదరులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలో ప్రకాశ్‌ నాయుడు బాధితుల ఇంటికెళ్లి బెదిరించాడు. తనపైనే కేసు పెడతారా అంటూ ప్రకాశ్‌ నాయుడు ఓ మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి పబ్లిగ్గా బూతులు తిట్టాడు ప్రకాశ్‌ నాయుడు. 

Latest News

 
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM
కేజీఎఫ్ -3 ఏపీలోనే ఉంది.. చంద్రబాబు Sat, Apr 20, 2024, 07:16 PM
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM