12 గంటల పాటు ఆ వెబ్‌సైట్‌ పనిచేయదు..అలర్ట్

by సూర్య | Sat, Oct 23, 2021, 07:38 AM

ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. తమ వెబ్‌సైట్‌ వివిధ పనులలో భాగంగా దాదాపు 12 గంటల పాటు నిలిచిపోనుందని, దీనిని వినియోగదారులు గమనించాలని కోరింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపు పన్ను సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ https:///www.incometax.gov.in లో ప్రకటించింది. వెబ్‌సైట్‌ నిలిచిపోయిన కారణంగా ఈ సమయంలో ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు. ఈ వెబ్‌సైటులో ఇతర సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో పోర్టల్‌ ప్రారంభించినప్పటి నుంచి ఈ పోర్టల్‌లో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్‌ సంస్థ సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చర్చించి, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. వెబ్‌సైటులో తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM