కరోనా మృతుల సంఖ్య తగ్గుముఖం

by సూర్య | Sun, Jun 13, 2021, 11:22 AM

కర్ణాటక  జిల్లాలో రెండు నెలల పాటు కరోనా సెకెండ్‌ వేవ్‌ తీవ్ర దుష్పప్రమాణాలు చూపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ విధించిన కారణంగా రెండువేలకు పైగా ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలో క్రమేణా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జిల్లాలో ఐదువందల లోపే నమోదు కావడంతో పాటు మృతల సంఖ్య దాదాపుగా తగ్గింది. గత నెలలో కరోనా మృతుల సంఖ్యలో రోజూ 20కి పైగా ఉండగా, ప్రస్తుతం పది లోపు ఉండడంతో జిల్లా యంత్రాంగం ఊపి పీల్చుకుంటోంది. వైద్యాధికారుల లెక్కల ప్రకారం ఉభయ జిల్లాలో చేరి మొత్తం 337 కేసులు పాజిటీవ్‌ కేసులు ఉండగా, 9 మంది శనివారం కరోనా కారణంగా మృతి చెందారు. తాలూకా వారీగా పాజిటివ్‌ కేసులు పరిశీలిస్తే... బళ్లారి 69, సండూరు 28, సిరుగుప్ప 105, కూడ్లిగి 22, హడగలి 25, హొసపేట 35, హగరిబొమ్మనహళ్ళి 27, హరపనహళ్ళి 23 నమోదైనట్లు తెలలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 3,911 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Latest News

 
వరదయ్యపాళెంలో గడ్డివామి దగ్ధం Tue, May 07, 2024, 10:19 AM
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM