ఢిల్లీ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం...

by సూర్య | Sat, Jun 12, 2021, 03:12 PM

 దేశ రాజధాని నగరం ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లోని ఓ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు హుటాహుటిన దాదాపు 30 అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి.అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో, బ్లాక్ 1 వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ సమాచారం అందిన వెంటనే దాదాపు 30 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ ఇచ్చిన ట్వీట్‌లో, సెంట్రల్ మార్కెట్లోని ఓ బట్టల దుకాణంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మొత్తం 30 అగ్ని మాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నట్లు తెలిపారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపారు.


ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఓ నెల రోజులపాటు అమలైన అష్ట దిగ్బంధనం తర్వాత ఈ దుకాణాలను తెరిచారు. మంటలు భారీగా చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగ, ధూళి మేఘాలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.

Latest News

 
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 03:24 PM
దువ్వూరు మండలంలో పలువురు వైసీపీలో చేరిక Fri, May 03, 2024, 03:20 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 03:18 PM
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM