ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసు లో వెలుగులోకి వచ్చిన అక్రమాల చిట్టా

by సూర్య | Sat, Jun 12, 2021, 03:33 PM

జేపీ గ్రూప్‌ ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసులో తీగలాగే కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. నిందితుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఎమ్మెల్సీలు ఇప్పిస్తానంటూ రూ.కోటి వసూలు చేసినట్లు సమాచారం. ఇరిగేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగికి రూ.25 లక్షలు టోకరా వేసినట్లు తెలిసింది. విశాఖలో ఉడా భూములు లీజుకు ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ధవళేశ్వరం వద్ద ఇసుక ట్రెడ్జింగ్‌ కాంట్రాక్ట్‌ పేరిట రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు కస్టడీ లోకి తీసుకోనున్నారు.

Latest News

 
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM