ఇలాంటి ప్లేయర్స్‌ మనకు అవసరమా.! : మాజీ మహిళ క్రికెటర్‌ లిసా

by సూర్య | Sat, Jun 12, 2021, 12:35 PM

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా మొహమ్మదాన్, అబహాని జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో  బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ శుక్రవారం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన పనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ "డీపీఎల్‌ " లో భాగంగా అంపైర్‌తో వాదనకు దిగి స్వల్ప వ్యవధిలో రెండుసార్లు అసహనంతో స్టంప్స్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో షకీబ్‌ చర్యను తప్పుబడుతూ ఆసీస్‌ మాజీ మహిళ క్రికెటర్‌ లిసా స్టాలేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '' బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు ఇది కొత్తేం కాదు. ఆ జట్టు యువ ఆటగాళ్ల నుంచి ఇటువంటి సంఘటనలు చాలానే చూశాం. షకీబ్‌ ఒక సీనియర్‌ క్రికెటర్‌ అయి ఉండి సహనం కోల్పోయి ఇలాంటి పనులు చేయడం దారుణం. అవుట్‌ ఇవ్వనంత మాత్రానా అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టంప్స్‌ను పడేయడం క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఇలాంటి ప్లేయర్స్‌ మనకు అవసరమా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే షకీబుల్‌ హసన్‌ తాను చేసిన పనిపై ట్విటర్‌ వేదికగా అభిమానులను క్షమాపణ కోరాడు. '' డియర్‌ ఫ్యాన్స్‌... నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. నా సహనం కోల్పోయి అంపైర్‌పై దురుసుగా ప్రవర్తించాను. ఒక సీనియర్‌ ఆటగాడిగా ఇలాంటి పనులు చేయకూడదు. కానీ ఆ క్షణంలో ఏం చేస్తున్నానో అర్థమయ్యేలోపే తప్పు జరిగిపోయింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM