వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి డొమినికా కోర్టు లో ఎదురుదెబ్బ

by సూర్య | Sat, Jun 12, 2021, 10:54 AM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో రూ.13,500 కోట్ల రుణం ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్‌ చోక్సీ 2018లో భారత్‌ విడిచి ఆంటిగ్వా బార్బుడాకు పారిపోయిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు నీరవ్ మోదీ కూడా యూకేకు పారిపోయారు. వీరిద్దరినీ భారత్‌కు తీసుకువచ్చేందుకు సీబీఐ, ఈడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మే 23న చోక్సీ విందు కోసం డొమినికాకు వెళ్లగా.. ఆయన అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు అభియోగాలు మోపుతూ అరెస్టు చేశారు. ఆంటిగ్వా నుంచి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో క్యూబా పారిపోయేందుకు ప్రయత్నించిన చోక్సీ డొమినికాలో పట్టుబడ్డారు. అయితే  చోక్సీకి బెయిల్‌ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని డొమినికా కోర్టు పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. తన సోదరుడితో కలిసి ఉంటానని కోర్టుకు తెలుపగా.. అది స్థిర నివాసం కాదంటూ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించారన్న ఆరోపణలపై ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు బెయిల్ పిటిషన్‌ను 11వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై శుక్రవారం డొమినికా కోర్టులో ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి.


అయితే.. చోక్సీపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని కోర్టు అభిప్రాయపడింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి బెయిల్‌ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. బెయిల్‌ కోసం బలమైన పూచీకత్తు ఇవ్వలేదని, విదేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిపారు. చోక్సీకు విమాన, పలు ప్రమాదాలు ఉన్నాయని కూడా కోర్టులో తెలుపగా.. వాటిని కోర్టు తోసిపుచ్చింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM