టెస్ట్ క్రికెట్ లో అత్యల్ప స్కోర్.. 12 పరుగులకే ఆలౌట్.!

by సూర్య | Sat, Jun 12, 2021, 10:28 AM

సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ పూర్తి కావాలంటే హాఫ్ డే లేదా ఒక రోజు పడుతుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేవలం 40 నిమిషాల్లోనే ఓ ఇన్నింగ్స్ పూర్తయింది. 12 పరుగులకే ఆలౌట్ అయ్యారు. క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. ఈ మ్యాచ్ 1907 జూన్ 10-12 మధ్య జరిగింది. నార్తాంప్టన్షైర్, గ్లౌసెస్టర్షైర్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్షైర్ మొదట బ్యాటింగ్ చేసింది. 60 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో జీఎల్ జెస్సప్ మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్షైర్ చెత్త ప్రదర్శన కనబరిచింది. మొత్తం జట్టు 40 నిమిషాల్లో కేవలం 12 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. చివరి రెండు వికెట్లకు మరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరింది. మొదటి ఇన్నింగ్స్‌లో నార్తాంప్టన్షైర్ జట్టు ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ నాలుగేసి పరుగులు చేయగా.. ఒక ఆటగాడు రెండు, మరో ఆటగాడు ఒక పరుగు చేసి పెవిలియన్ చేరారు. కౌంటీ క్రికెట్‌లో ఇది అత్యల్ప స్కోరు కాగా, మొత్తం మీద మూడవ ఆల్‌టైమ్ అత్యల్ప స్కోరు. 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM